Upasana: ఈసారి పాలపిట్ట ముచ్చట్లు చెప్పిన ఉపాసన
- వన్యప్రాణుల తరఫున ఉపాసన వకాల్తా
- పాలపిట్ట వివరాలు వెల్లడి
- పాలపిట్టల మృతికి కారణమవుతున్నారంటూ ఆవేదన
మెగా కోడలు కొణిదెల ఉపాసన కొంతకాలంగా వన్యప్రాణి ప్రపంచంతో మమేకమవుతున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపక్షి రామచిలుక గురించి చెప్పిన ఉపాసన ఈసారి తెలంగాణ రాష్ట్రపక్షి పాలపిట్ట గురించి వివరించారు. పాలపిట్టను ఇంగ్లీషులో 'ఇండియన్ రోలర్ బర్డ్' అంటారని, దీని శాస్త్రీయనామం కొరాసియస్ బెంగాలెన్సిస్ అని వెల్లడించారు.
దీనికున్న నీలి వర్ణం కారణంగా హిందీలో 'నీల్ కాంత్' అంటారని, దసరా పండుగ సమయాల్లో దీన్ని చూడడం, పూజించడాన్ని పవిత్రంగా భావిస్తారని ఉపాసన తెలిపారు. అందుకోసం పాలపిట్టలను పట్టుకోవడం, బంధించడం వంటి చర్యలకు పాల్పడుతుంటారని, ఈ కారణంగా చాలా పాలపిట్టలు మృత్యువాత పడుతుంటాయని ఉపాసన ఆందోళన వ్యక్తం చేశారు.