Kodali Nani: కొడాలి నాని ప్రెస్ మీట్ కవరేజి టీవీలో వస్తుంటే ఇళ్లల్లో చానల్ మార్చేస్తున్నారు: కేఎస్ జవహర్

  • కొడాలి నాని బూతుశాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నారు
  • చంద్రబాబు లక్ష్యంగా దిగజారుడు వ్యాఖ్యలు
  • తొలి హామీనే తుంగలో తొక్కారు

ఏపీ మంత్రి కొడాలి నానిపై మాజీ మంత్రి, టీడీపీ నేత కేఎస్ జవహర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎనిమిది నెలలుగా రాష్ట్రాన్ని పట్టిపీడుస్తున్న జగరోనా వైరస్ గురించి మాట్లాడకుండా, చంద్రబాబు లక్ష్యంగా మంత్రి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీల్లో కొడాలి నాని ప్రెస్ మీట్ వస్తుందంటే ఇళ్లల్లో పిల్లల తల్లిదండ్రులు చానల్ మార్చేస్తున్నారని అన్నారు.

అధికారంలోకి రాగానే మూడు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి, తొలి హామీనే తుంగలో తొక్కారని జవహర్ విమర్శించారు. ప్రజలు ఛీత్కరించుకుంటున్నా వైసీపీ నేతలకు బుద్ధి రావడం లేదన్నారు. సన్నబియ్యంపైనా వైసీపీ మాట తప్పిందన్నారు. అయినప్పటికీ బూతుశాఖ మంత్రి కొడాలి దానిని సమర్థించుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఆయన మాటలు, హావభావాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ప్రజలు సరైన శిక్ష విధిస్తారని జవహర్ హెచ్చరించారు.

Kodali Nani
KS Jawahar
Andhra Pradesh
  • Loading...

More Telugu News