spa: పేరుకు స్పా.. చేసేది వ్యభిచారం: పోలీసుల అదుపులో యువతులు, విటులు!

  • కేపీహెచ్‌బీ ఆరో ఫేజ్‌లో స్పా అండ్ సెలూన్
  • పోలీసుల అదుపులో నిర్వాహకుడు వెంపటి సతీశ్
  • నగదు, తొమ్మిది సెల్‌ఫోన్లు స్వాధీనం

స్పా ముసుగులో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాద్, కేపీహెచ్‌బీ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ ఆరోఫేజ్‌లో వెంపటి సతీశ్ గ్లోవెల్ ఫ్యామిలీ స్పా అండ్ సెలూన్‌ను నిర్వహిస్తున్నాడు. అయితే, ఆ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు.

ముగ్గురు మహిళలు, ఆరుగురు విటులు, ఓ మహిళా ఉద్యోగితోపాటు నిర్వాహకుడు సతీశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి లక్షా పదమూడువేల రూపాయల నగదు, తొమ్మిది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News