Nadendla Manohar: పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించడాన్ని ఎలా తప్పుబడతారు?: నాదెండ్ల మనోహర్

  • వ్యవస్థను పవన్ కల్యాణ్ నమ్ముకున్నారు
  • వ్యవస్థలో చాలా మంది ఆయనపై ఆధారపడి ఉంటారు
  • పార్టీ నిర్మాణంలో భాగంగా పవన్ సినిమాల్లో నటించడం అవసరం

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటిస్తుండటంపై విమర్శలు తలెత్తడం, పవన్ ది నిలకడ లేని మనస్తత్వం అని విమర్శిస్తూ ఆ పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేయడం తెలిసిందే. ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ ను ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంత వ్యవస్థను పవన్ కల్యాణ్ నమ్ముకోవడమే కాకుండా వ్యవస్థలో ఉన్న చాలా మంది కుటుంబసభ్యులు ఆయనపైన ఆధారపడి ఉంటారని అన్నారు. జనసేన పార్టీ నిర్మాణంలో భాగంగా సినిమాల్లో పవన్ కల్యాణ్ నటించడం చాలా అవసరమని అన్నారు. వీటన్నింటిని ఆధారంగా చేసుకునే పవన్ మళ్లీ సినిమాల్లో నటించాలనుకున్నారని, గతంలో ఒకటి, రెండు చిత్రాల్లో నటిస్తానన్న ఒప్పందంతో పాటు కొత్తగా మరోచిత్రంలో నటిస్తానని ఆయన నిర్ణయం తీసుకున్నారని, దీనిని ఎలా తప్పుపడతామని ప్రశ్నించారు.

Nadendla Manohar
Janasena
Pawan Kalyan
Cinema
  • Loading...

More Telugu News