Pawan Kalyan: పవన్ కు నిలకడ లేదన్నది ప్రత్యర్థుల సృష్టి: నాదెండ్ల మనోహర్

  • మీడియా సంస్థకు నాదెండ్ల ఇంటర్వ్యూ
  • పవన్ ఎంతో నిజాయతీ ఉన్న నేత అని వెల్లడి
  • జనసేన పార్టీ కాదు ఓ ఉద్యమం అని వ్యాఖ్యలు

ఇటీవల జనసేన పార్టీకి రాజీనామా చేసిన నేతలు చెప్పేదొక్కటే... పవన్ కల్యాణ్ కు నిలకడ ఉండదని! దీనిపై ఆ పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. పవన్ కు నిలకడ ఉండదన్న అభిప్రాయాన్ని సృష్టించారని వెల్లడించారు. వాస్తవానికి పవన్ కల్యాణ్ ఎంతో నిజాయతీ ఉన్న నాయకుడని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడేవిధంగా, యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా మనవంతు కృషి చేద్దాం అని భావించే వ్యక్తి పవన్ కల్యాణ్ అని చెప్పారు. అయినా పవన్ కల్యాణ్ ను ఒక్కడ్నే స్థిరత్వం లేదంటూ టార్గెట్ చేయడం సరికాదని, రాజకీయాల్లోనే నిలకడలేదని వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగానే పవన్ పై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. జనసేన ఓ పార్టీ కాదని ఓ ఉద్యమం అని మనోహర్ స్పష్టం చేశారు.

Pawan Kalyan
Nadendla Manohar
Janasena
Politics
  • Loading...

More Telugu News