Prathipati Pulla Rao: వైసీపీని ఉద్దేశించి టీడీపీ నేత ప్రత్తిపాటి సంచలన వ్యాఖ్యలు!

  • మళ్లీ  మేము అధికారంలోకి వస్తే ‘రివెంజ్’ తీర్చుకుంటాం
  • మా తొలి ప్రాధాన్యత ‘రివెంజ్’, రెండోది ‘అభివృద్ధి’
  • ఇప్పుడు మాపై అక్రమ కేసులు పెడతారా?

టీడీపీ నాయకులు, ఆ పార్టీకి మద్దతుగా నిలిచే వారిపై కేసులు బనాయిస్తున్న ఘటనలపై ఆ పార్టీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. వైసీపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే ‘రివెంజ్’ తీర్చుకోవడమే తమ లక్ష్యమని, తమ మొదటి ప్రాధాన్యత ‘రివెంజ్’ అని, రెండో ప్రాధాన్యత ‘అభివృద్ధి’ అని చెప్పారు. ఇప్పుడు తమపై నాలుగు కేసులు బనాయిస్తే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి పది కేసులు పెడతామని హెచ్చరించారు. మన దమ్ము ఏంటో ఈసారి చూపిద్దామని, టీడీపీ అధికారంలోకి వస్తే ఎంతటి అధికారినైనా వదిలే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Prathipati Pulla Rao
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News