Pawan Kalyan: రాజధాని గ్రామాల్లో మరోసారి పర్యటించనున్న పవన్ కల్యాణ్

  • త్వరలోనే పవన్ పర్యటన తేదీలు ఖరారు
  • ఏ గ్రామాలను సందర్శించాలో సూచించాలని నేతలకు పవన్ ఆదేశం
  • తమ గ్రామాలకు రావాలని ఇటీవల పవన్ ను కోరిన రైతులు

జనసేనాని పవన్ కల్యాణ్ రాజధాని అమరావతి గ్రామాల్లో మరోసారి పర్యటించనున్నారు. పవన్ పర్యటన రెండ్రోజుల పాటు సాగనుంది. ఏ గ్రామాలను సందర్శించాలో తెలియజేయాల్సిందిగా స్థానిక నాయకులకు పవన్ సూచించారు. పవన్ పర్యటనకు సంబంధించి తేదీలు ఇంకా ఖరారు కాలేదు. ఇటీవలి రాజధాని రైతుల అసెంబ్లీ ముట్టడి అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో రైతులు పవన్ కల్యాణ్ ను కలిశారు. తమ గ్రామాల్లో పర్యటించాల్సిందిగా కోరగా, వారి విజ్ఞప్తికి పవన్ సానుకూలంగా స్పందించారు.

Pawan Kalyan
AP Capital
Amaravati
Farmers
Janasena
  • Loading...

More Telugu News