Medaram: జనసంద్రంలా మారిన మేడారం... జాతరకు తరలివస్తున్న భక్తజనం

  • కొనసాగుతున్న సమ్మక్క-సారలమ్మ జాతర
  • పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తుల రాక
  • ఆదివారం కావడంతో పోటెత్తిన భక్తులు

ప్రతి ఏటా జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఈ ఏడాది కూడా ఘనంగా జరుగుతోంది. ములుగు జిల్లాలోని ఈ పుణ్యక్షేత్రానికి ఇవాళ భక్తులు ఇసుకేస్తే రాలనంతగా వచ్చారు. ఆదివారం కావడంతో పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సమ్మక్క-సారలమ్మ దేవస్థాన ప్రాంగణం జనసంద్రంలా మారింది. ఎక్కడెక్కడినుంచో మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులు ఇక్కడి జంపన్న వాగులో పవిత్రస్నానం ఆచరించి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News