Corona Virus: కరోనా వైరస్ కంటే ఈ వైరస్ ఎంతో ప్రమాదకరం: కొడాలి నాని

  • ఏపీలో ఎల్లో వైరస్ విజృంభిస్తోందన్న మంత్రి
  • ప్రభుత్వ పథకాలపై విషప్రచారం చేస్తోందంటూ విమర్శలు
  • కొడాలి నాని మీడియా సమావేశం

చైనాలో హడలెత్తిస్తున్న కరోనా వైరస్ ధాటికి యావత్ ప్రపంచం గజగజలాడిపోతోందని, అలాంటి కరోనా వైరస్ కంటే ఏపీలో ఉన్న ఎల్లో వైరస్ ఎంతో ప్రమాదకరం అని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. చైనాలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తుంటే, ఏపీలో ఎల్లో వైరస్ చెలరేగిపోతోందని విమర్శించారు. ప్రభుత్వ పథకాలపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని, చంద్రబాబు, రాధాకృష్ణ, రామోజీరావుల పేర్లు ఉంటేనే వృద్ధాప్య పింఛన్లు ఇచ్చినట్టా! అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వనరులను దోచుకోవచ్చన్నది ఎల్లో మీడియా ప్రణాళిక అని ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేశారు.

Corona Virus
Kodali Nani
Andhra Pradesh
Yellow Virus
YSRCP
  • Loading...

More Telugu News