Team New Zealand: మౌంట్ మాంగనుయ్ లో హోరాహోరీగా చివరి టి20

  • టీమిండియా స్కోరు 163/3
  • కివీస్ 16 ఓవర్లలో 5 వికెట్లకు 129
  • అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న రాస్ టేలర్

టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆసాంతం రసవత్తరంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ తరహాలో ఉత్కంఠభరితంగా సాగుతుండడంతో సగటు అభిమాని నూటికి నూరుశాతం వినోదం అందుకుంటున్నాడు. ఇప్పుడు మౌంట్ మాంగనుయ్ లో జరుగుతున్న చివరిదైన ఐదో టి20 మ్యాచ్ లో కూడా కివీస్, టీమిండియా మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. టీమిండియా విసిరిన 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు 16 ఓవర్లలో 5 వికెట్లకు 129 పరుగులు చేసింది. క్రీజులో సీనియర్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్ ఉన్నాడు. అర్థసెంచరీ పూర్తిచేసుకున్న టేలర్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మన్ల సహకారంతో జట్టును గెలుపుతీరాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో కివీస్ గెలవాలంటూ 24 బంతుల్లో 35 పరుగులు చేయాలి.

Team New Zealand
Team India
T20
Mount Maunganui
  • Loading...

More Telugu News