Telugudesam: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాటలకు విలువ ఎక్కడుంది?: వైసీపీ ఎంపీ నందిగం సురేశ్

  • బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మళ్లీ నటిస్తున్నారు
  • ఆ సినిమాలోని డైలాగ్స్ చెప్పారు
  • బాలకృష్ణ అంత పవర్ ఫుల్ వ్యక్తేమి కాదు

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణపై వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ విమర్శలు చేశారు. హిందూపురంలో బాలకృష్ణ కాన్వాయ్ ను ఇటీవల అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై సురేశ్ స్పందిస్తూ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో బాలకృష్ణ మళ్లీ నటిస్తున్నారని, అందుకే, ఆ సినిమాలో డైలాగ్స్ ను ఆయన చెప్పుంటాడని, అంతాకానీ, ఆయనకు అంత సీన్ లేదని, అంత పవర్ ఫుల్ మ్యానేమి కాదని సెటైర్లు విసిరారు. బాలకృష్ణ అంత పవర్ ఫుల్ వ్యక్తేమి కాదని విమర్శించారు. బాలకృష్ణ మాటలను ఎవరు పట్టించుకుంటారని, అసలు ఆయన మాటలకు విలువ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఒకవేళ బాలకృష్ణ అంత పవర్ ఫుల్ మ్యాన్ కనుక అయితే, నాడు తన తండ్రి ఎన్టీఆర్ ని మోసం చేసిన బావ చంద్రబాబు నుంచి  ఒక్క మంత్రి సీటు సంపాదించలేకపోయాడని చంద్రబాబుపై విమర్శలు చేశారు.

Telugudesam
Nandamuri Balakrishna
YSRCP
Nandigam Suresh
Mp
Chandrababu
  • Loading...

More Telugu News