Kodali Nani: జేసీ నోరు అదుపులో పెట్టుకో.. వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు: మంత్రి కొడాలి నాని

  • రాష్ట్రంలో అడ్డగోలుగా ఇష్టమొచ్చినట్లు జేసీ బస్సులు 
  • పర్మిట్లు కట్టకుండా బస్సులు నడుపుతున్నారు
  • అందుకే బస్సులను సీజ్‌ చేశారు 
  • యనమలకు మైండ్ పని చేయట్లేదు

ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శించే స్థాయి జేసీకి లేదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... జేసీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, ఆయనకు వయసు వచ్చిందని కానీ బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన వ్యక్తి జేసీ అని అన్నారు.

రాష్ట్రంలో అడ్డగోలుగా ఇష్టమొచ్చినట్లు జేసీ బస్సులు ఉన్నాయని నాని ఆరోపించారు. పర్మిట్లు కట్టకుండా బస్సులు నడుపుతున్నారని, అందుకే బస్సులను సీజ్‌ చేశారని చెప్పారు. ఓవర్‌ స్పీడ్‌తో ప్రజల ప్రాణాలు తీశారని తెలిపారు.

మూడు రాజధానులకు వ్యతిరేకంగా 29 గ్రామాల్లోనే ఉద్యమం జరుగుతోందని, వికేంద్రీకరణ బిల్లును రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. యనమలకు మైండ్ పని చేయట్లేదని, గతంలో బీజేపీతో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు యనమల రాష్ట్రానికి నిధులు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు.

Kodali Nani
JC Diwakar Reddy
Andhra Pradesh
  • Loading...

More Telugu News