YSRCP: దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు: మంత్రి వెల్లంపల్లి
- దేవదాయ భూములను కాపాడుతున్నాం
- భీమిలి దేవదాయ భూముల లీజు వ్యవహరంలో అక్రమాలు జరగలేదు
- భూముల లీజు వేలం రద్దు చేస్తూ జనవరి 28నే పత్రికల్లో ప్రకటన చేశాం
ఆంధ్రప్రదేశ్‌లో దేవదాయ భూములను కాపాడుతున్నామని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని ఆయన చెప్పారు. భీమిలి దేవదాయ భూముల లీజు వ్యవహరంలో అక్రమాలు జరగలేదని తెలిపారు. 67 ఎకరాలను ధారాదత్తం చేస్తున్నారనే ఆరోపణలు అవాస్తవమని అన్నారు.
కోట్ల విలువైన భూమిని అక్రమంగా కట్టుబెడుతున్నారనే ఆరోపణ అబద్ధమని వెల్లంపల్లి తెలిపారు. భూముల లీజు వేలం రద్దు చేస్తూ జనవరి 28నే పత్రికల్లో ప్రకటన చేశామని, నిబంధనల ప్రకారమే దేవదాయ భూములకు వేలం వేశామని చెప్పారు. దేవదాయ భూమి గజం అమ్మాలన్నా హైకోర్టు అనుమతి తీసుకోవాలని తెలిపారు. దేవదాయ భూములపై దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.