YSRCP: విజయవాడలో వైసీపీ ఎంపీకి చేదు అనుభవం

  • నందిగామలో ఓ వైద్యుడిని కలిసేందుకు వెళ్లిన ఎంపీ సురేశ్
  • ఆయన కారును అడ్డుకున్న స్థానికులు
  • 'అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి.. పరిపాలన వికేంద్రీకరణ వద్దు' నినాదాలు 

విజయవాడలో వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. నందిగామలో ఓ వైద్యుడిని కలిసేందుకు ఆయన వెళ్లిన సమయంలో ఆయన కారును కొందరు అడ్డుకున్నారు. 'అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి.. పరిపాలన వికేంద్రీకరణ వద్దు' అని వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన కారును టీడీపీ కార్యకర్తలు ముందుకు కదలనివ్వలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని ఎంపీ సురేశ్‌ ఈ సందర్భంగా తెలిపారు.  

  • Loading...

More Telugu News