Nellore District: నెల్లూరు పారిశ్రామికవేత్త కుమారుడికి కిడ్నాపర్ల బెదిరింపులు.. రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్

  • పట్టణంలో పలు షాపింగ్ మాల్స్
  • పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు
  • రహస్యంగా విచారణ జరుపుతున్న పోలీసులు

నెల్లూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడికి కిడ్నాపర్లు ఫోన్ చేసి బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు కోట్ల రూపాయలు ఇవ్వకుంటే కిడ్నాప్ చేసి హతమారుస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు ఫోన్ చేసి బెదిరించారు. విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు.

బాధిత యువకుడి తండ్రికి నెల్లూరులో పలు షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇటీవల ఆయన కుమారుడికి ఫోన్ చేసిన దుండుగులు వెంటనే రూ. 2 కోట్లు ఇవ్వాలని, లేకుంటే కిడ్నాప్ చేసి హతమారుస్తామని హెచ్చిరించినట్టు తెలిసింది. పారిశ్రామికవేత్త ఫిర్యాదు ఆధారంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా నిందితుల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, విషయం బయటపడకుండా రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు.

Nellore District
kidnappers
Crime News
Andhra Pradesh
  • Loading...

More Telugu News