Infosys: తాను రచించిన పుస్తకాన్ని పెంపుడు కుక్కతో ఆవిష్కరింపజేసిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపక చైర్మన్ భార్య సుధామూర్తి

  • 'గోపి డైరీస్‌ - కమింగ్‌ హోమ్' పేరిట పుస్తకం
  • పెంపుడు శునకంపై బుక్ రాసిన సుధామూర్తి
  • కార్యక్రమంలో పాల్గొన్న నారాయణమూర్తి

ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌, నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి, తాను రచించిన ఓ పుస్తకాన్ని తన పెంపుడు కుక్కతో ఆవిష్కరింపజేశారు. 'గోపి డైరీస్‌ - కమింగ్‌ హోమ్' పేరిట తానెంతో ప్రేమగా పెంచుకుంటున్న శునకంపైనే ఆమె ఈ పుస్తకాన్ని రాశారు. ఆ కుక్క పేరు గోపి. ఆ పేరిటే పుస్తకం టైటిల్ పెట్టారు. తాజాగా, హైదరాబాద్ లోని అశోక్ నగర్‌ లో జరిగిన ఓ కార్యక్రమంలో పుస్తకావిష్కరణ జరిగింది. రచయిత్రి సుధామూర్తి మాట్లాడుతూ గోపి అంటే తనకెంతో ఇష్టమని అన్నారు. దానితో తనకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి గోపీతో తన అనుభూతులనే ఈ పుస్తకంలో రాశానని అన్నారు. తమ వద్ద ఉన్న పెంపుడు జంతువులను షోషించలేనని భావించే వారు, వాటిని ఇబ్బంది పెట్టకుండా జంతుసంరక్షణ శాలలకు అప్పగించాలని సుధామూర్తి సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌ నారాయణమూర్తి కూడా పాల్గొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News