Hyderabad: వైభవంగా పరిటాల సునీత కుమారుడి నిశ్చితార్థం... ఆశీర్వదించిన చంద్రబాబు!
- హైదరాబాద్ లో వేడుక
- కుమారుడు లోకేశ్ తో కలిసి వచ్చిన చంద్రబాబు
- నెల్లూరు జిల్లా యువతి తేజస్వితో త్వరలో వివాహం
దివంగత నేత పరిటాల రవి, సునీత దంపతుల రెండవ కుమారుడు సిద్ధార్థ నిశ్చితార్థం శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుతో పాటు లోకేశ్ తదితరులు హాజరై, కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. నెల్లూరు జిల్లాలో రైతు కుటుంబానికి చెందిన మామిళ్లపల్లి తేజస్వితో సిద్ధార్థ వివాహాన్ని పెద్దలు నిశ్చయించారు. వీరిద్దరి వివాహమూ త్వరలో జరుగనుంది.