Tirumala: తిరుమలలో వైభవంగా రథ సప్తమి వేడుకలు.. ఏడు వాహనాల్లో ఊరేగిన శ్రీవారు
- సూర్యప్రభ వాహనంతో మొదలు.. చంద్రప్రభ వాహనంతో ముగింపు
- ఈ ఉత్సవాలకు ‘ఒక రోజు బ్రహ్మోత్సవాలు’ అని కూడా పేరు
- తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ..భక్తులకు అభయ ప్రదానం
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు వెలసిన తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో భక్తులు పాలుపంచుకుంటున్నారు. ఈ ఉత్సవాలను ‘ఒక రోజు బ్రహ్మోత్సవాలు’ అని కూడా పిలుస్తుంటారు. ఈ రోజు స్వామి వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు వాహనాల్లో ఊరేగుతారు. ఈ విశిష్టత వల్లే ఈ రోజుకు ఆ పేరు వచ్చింది. సూర్య ప్రభ వాహనంపై శ్రీవారు
మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ.. భక్తులకు అభయ ప్రదానం చేశారు. సూర్యోదయ సమయంలో సూర్య ప్రభ వాహనం సేవతో ప్రారంభించి.. రాత్రి చంద్రోదయాన చంద్ర ప్రభ వాహన సేవతో వాహన సేవలు ముగుస్తాయి.
గరుడవాహనంపై శ్రీవారు ఊరేగుతున్న దృశ్యం
హనుమంత వాహనంపై స్వామివారు
కల్పవృక్షంపై ఊరేగుతున్న స్వామివారు
చినశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్న శ్రీవారు
చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న శ్రీవారు