Kurnool judicial Capital: కర్నూలుకు కార్యాలయాల తరలింపు నిజమేనన్న మంత్రి బుగ్గన

  • న్యాయశాఖకు చెందిన కార్యాలయాలు తరలిస్తున్నాము
  • అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనే ముందుకు సాగుతున్నాం
  • అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ధర్నాలు చేశారు  

కర్నూలును ఏపీ జ్యుడీషియల్ రాజధానిగా చేయాలన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం... అందుకు తగ్గట్టుగానే కార్యాలయాలను తరలిస్తోందని రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. న్యాయశాఖకు చెందిన కార్యాలయాలు, ట్రైబ్యునళ్లను కర్నూలుకు తరలిస్తున్నామని ఆయన వివరించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనే తాము ముందుకు సాగుతున్నామని ఆయన వివరించారు.

గతంలో చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే తాము నడుచుకుంటున్నామని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. ఇదిలావుండగా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై బుగ్గన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబే అసలైన తుగ్లక్ అని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు చేసింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. మందబలంతో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను మండలిలో అడ్డుకునే ప్రయత్నం టీడీపీ చేస్తోందని బుగ్గన మండిపడ్డారు. దుర్మార్గమైన పాలన చేసి ఏమీ తెలియనట్టు టీడీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు.

Kurnool judicial Capital
Tribunals
Offices Shift
Andhra Pradesh
Buggana Rajendranath
  • Loading...

More Telugu News