Shaheen Bagh: షహీన్ బాగ్ లో కాల్పులు... ఆగని సీఏఏ జ్వాలలు!

  • సీఏఏ తీసుకువచ్చిన కేంద్రం
  • కేంద్రం నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత
  • కొన్నిరోజుల కిందట గోపాల్ అనే వ్యక్తి కాల్పులు
  • నేడు పోలీసు బ్యారికేడ్లపైకి తుపాకీ ఎక్కుపెట్టిన మరో వ్యక్తి

కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఢిల్లీలో నిరసన జ్వాలలు రగిలిస్తోంది. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న షహీన్ బాగ్ ప్రాంతంలో కాల్పుల మోత వినిపించింది. మొన్న గోపాల్ అనే వ్యక్తి తుపాకీతో నిరసనకారులపై కాల్పులు జరిపిన ఘటన మరువకముందే మరో వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. షహీన్ బాగ్ లో పోలీసు బారికేడ్లను లక్ష్యంగా చేసుకుని ఓ వ్యక్తి 'జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేస్తూ కాల్పులు జరిపాడు. అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Shaheen Bagh
New Delhi
CAA
Police
Protests
  • Loading...

More Telugu News