Union Budget 2020: కేంద్ర బడ్జెట్ మొత్తం అంచనా రూ.30,42,230 కోట్లు!

  • రూ.30.42 లక్షల కోట్ల ఆదాయ, వ్యయాలతో అంచనాలు
  • మూలధన వసూళ్లు రూ.10.21 లక్షల కోట్లు
  • రెవెన్యూ లోటు రూ.6 లక్షల కోట్లు
  • ద్రవ్యలోటు అంచనా రూ.7.96 లక్షల కోట్లు

ఎన్డీయే ప్రభుత్వం 2020-21కి సంబంధించి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం చేశారు. అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తూ తీసుకువచ్చిన బడ్జెట్ అని ఎన్డీయే ప్రభుత్వం చెప్పుకుంటున్న ఈ బడ్జెట్ ను మొత్తం రూ.30,42,230 కోట్లుగా అంచనా వేశారు. గతేడాది బడ్జెట్ కంటే ఇది ఎక్కువ. 2019-20లో బడ్జెట్ మొత్తం రూ.27,86,349 కోట్లు.

ఇక, తాజా బడ్జెట్ విషయానికొస్తే, పన్నుల ద్వారా రూ.16.35 లక్షల కోట్లు, పన్నేతర ఆదాయం రూ.3.85 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేశారు. మూలధన వసూళ్లు రూ.10.21 లక్షల కోట్లు కాగా, అందులో రుణాల వసూళ్ల ద్వారా రూ.14.96 వేల కోట్లు, ఇతర మార్గాల్లో రూ.10 లక్షల కోట్లకు అంచనాలు రూపొందించారు. ఈసారి రెవెన్యూ లోటు రూ.6 లక్షల కోట్లు కాగా, ద్రవ్యలోటును రూ.7.96 లక్షల కోట్లుగా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News