Shabhana Ajmi: రోడ్డు ప్రమాదం తర్వాత.. కోలుకున్న బాలీవుడ్ నటి షబానా అజ్మీ ఫొటో... వైరల్

  • రెండు వారాల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నటి
  • కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స
  • మీ ప్రార్థనలతో కోలుకున్నానంటూ ట్వీట్

రెండు వారాల క్రితం ముంబయి-పుణె ఎక్స్ ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాలీవుడ్ నటి షబానా అజ్మీ కోలుకున్నారు. ప్రమాదం అనంతరం షబానాను తొలుత ముంబయిలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం, మెరుగైన వైద్యంకోసం కోకిలాబెన్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్సతో కోలుకున్న షబానా నిన్న డిశ్చార్జ్ అయ్యారు.

అనంతరం ఆమె తన తాజా ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తాను ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ‘మీ అందరికి ధన్యవాదాలు.. మీ ప్రార్థనలతో త్వరగా కోలుకున్నా. చికిత్స తర్వాత తిరిగి ఇంటికి వచ్చాను.  ఆస్పత్రిలో చేరిననాటి నుంచి అండగా నిలిచిన టీనా అంబానీ, కోకిలాబెన్ అంబానీలకు, వైద్యులకు  ధన్యవాదాలు. మీకు రుణపడి ఉన్నాను’ అని తెలిపారు.

Shabhana Ajmi
latest Photo
After Accident
  • Loading...

More Telugu News