Andhra Pradesh: ఏపీ ఆర్టీసీ కార్మికులకు తొలిసారిగా ప్రజా రవాణా విభాగం ద్వారా వేతన చెల్లింపులు
- వేతనాల కోసం రూ.600 కోట్లు విడుదల
- వేతనాల చెల్లింపునకు పాలనా పరమైన ఆమోదం
- ప్రస్తుతానికి ఆర్టీసీలో ఉన్నప్పటి వేతనాలే చెల్లింపు
- ప్రభుత్వ ఉద్యోగుల తరహా పేస్కేలు అమలుకు మరింత సమయం
ఏపీలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన సంగతి తెలిసిందే. ఆర్టీసీ విలీనంతో రాష్ట్రంలో కొత్తగా ప్రజా రవాణా విభాగం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రజా రవాణా ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ కార్మికులకు వేతనాల కింద రూ.600 కోట్ల విడుదలకు పాలనా పరమైన ఆమోదం లభించింది. తొలిసారి ప్రజా రవాణా విభాగం ద్వారా జీతాల చెల్లింపునకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రోడ్లు, రవాణా, భవనాల శాఖ నుంచి సీఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లింపునకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి ఉద్యోగులకు ఆర్టీసీలో ఉన్న వేతనాలనే కొనసాగించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతన స్కేలు అమలుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.