Jagan: వారి కళ్లలో కనిపించిన సంతోషం నా బాధ్యతను మరింత పెంచింది: సీఎం జగన్

  • వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు అభినందనలు తెలిపిన సీఎం
  • ప్రజల దీవెన, దేవుడి దయతోనే సాధ్యమైందని వ్యాఖ్యలు
  • అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచన

రాష్ట్రంలో పెన్షన్లను లబ్దిదారుల ఇళ్లవద్దనే అందించాలన్న సంకల్పాన్ని సాకారం చేశారంటూ గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ఎక్కడా అవినీతికి, వివక్షకు తావులేకుండా 54.6 లక్షల మందికి ఇంటివద్దే పెన్షన్ అందిస్తుంటే వాళ్ల కళ్లలో కనిపించిన ఆనందం తన బాధ్యతను మరింత పెంచిందని సీఎం జగన్ పేర్కొన్నారు.

దేవుడి దయ, ప్రజల దీవెనలతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడు రూ.2250 పెన్షన్ అందుతోందని, పెన్షన్ వయస్సును సైతం 65 నుంచి 60కి తగ్గించామని వెల్లడించారు. కొత్తగా 6.11 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Jagan
Andhra Pradesh
Pentions
Volunteers
YSRCP
  • Error fetching data: Network response was not ok

More Telugu News