Union Budget 2020: మరో రెండు పేజీలు మిగిలి ఉండగానే బడ్జెట్ ప్రసంగాన్ని ముగించిన నిర్మల

  • స్వల్ప అస్వస్థతకు గురైన నిర్మల
  • స్పీకర్ అనుమతితో ప్రసంగం ముగింపు
  • మిగిలిన ప్రసంగం చదివినట్టుగా పరిగణించాలని అభ్యర్థన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని సుదీర్ఘంగా కొనసాగించి పూర్తి చేయకుండానే ముగించారు. ఈ రోజు లోక్ సభలో మంత్రి బడ్జెట్ పై ప్రసంగిస్తూ.. అస్వస్థతకు గురయ్యారు. బీపీ తగ్గటంతో నుదిటిపై చెమటలు కనిపించాయి. అయినా ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించారు.

సభలో సహచర మంత్రులు ఆమెకు పంచదారను అందించినా దాన్ని తీసుకోవడానికి నిర్మల నిరాకరించారు. ఎలాగైనా ప్రసంగాన్ని పూర్తి చేయాలనుకున్నప్పటికీ.. అస్వస్థత కారణంగా స్పీకర్ అనుమతితో మరో రెండు పేజీల ప్రసంగం మిగిలి ఉండగానే విరమించారు. మిగిలిన రెండు పేజీలు చదివినట్టుగానే పరిగణించాలని నిర్మల స్పీకర్ ను అభ్యర్థించారు. బడ్జెట్ ప్రసంగాన్ని ఆమె 2గంటల 42 నిమిషాలవరకు కొనసాగించారు. ఇది పార్లమెంట్ చరిత్రలో ఓ రికార్డ్.

Union Budget 2020
Nirmala Sitharaman
Tired
Not completed speech
BJP
  • Loading...

More Telugu News