Team India: టీమిండియా మ్యాచ్ ఫీజులో కోత విధించిన ఐసీసీ

  • నాలుగో టీ20లో స్లో ఓవర్ రేట్ తప్పిదం
  • నిర్ణీత వ్యవధికి 2 ఓవర్లు తక్కువగా విసిరిన భారత్
  • తప్పిదాన్ని అంగీకరించిన కోహ్లీ
  • జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ

న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ క్రీడాపండితులను విస్మయానికి గురిచేస్తోంది. వరుసగా రెండు మ్యాచ్ లలో సూపర్ ఓవర్ ను కాచుకుని అనూహ్య విజయాలు సొంతం చేసుకుంది. అయితే, కివీస్ తో వెల్లింగ్టన్ లో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత సమయంలోగా ఓవర్లు పూర్తి చేయలేకపోయిందంటూ ఐసీసీ జరిమానా విధించింది. నిర్ణీత సమయానికి ఇంకా 2 ఓవర్లు తక్కువ బౌల్ చేయడంతో స్లో ఓవర్ రేట్ తప్పిదం కింద భారత జట్టు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించారు. అయితే ఓవర్ రేట్ నిదానంగానే సాగిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒప్పుకోవడంతో దీనిపై తదుపరి విచారణ ఉండదు.

Team India
New Zealand
T20
ICC
Slow Over Rate
  • Loading...

More Telugu News