Hardik Pandya: కివీస్ తో టెస్ట్ సిరీస్ కు హార్దిక్ దూరం!

  • వెన్నుగాయం నుంచి కోలుకోని హార్దిక్ పాండ్యా
  • మరింత విశ్రాంతిని సూచించిన వైద్యులు
  • ఫిట్ నెస్ సాధించేవరకు ఎన్ సీఏ శిబిరంలోనే

వెన్ను గాయంతో బాధపడుతున్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంకా కోలుకోకపోవడంతో.. తాజాగా న్యూజిలాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు. కివీస్ తో ఆడే భారత టెస్ట్ జట్టును ఇప్పటికే ప్రకటించాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా గాయంనుంచి కోలుకుంటాడని ఆశిస్తూ.. అతనికి జట్టులో చోటు కల్పించడానికి సెలెక్టర్లు ఇప్పటివరకు జట్టు ఎంపికను ఆపారు. అయితే, హార్దిక్ కు ఇంకా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో బీసీసీఐ జట్టు ఎంపికకు హార్దిక్ పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రకటన చేసింది.

‘హార్దిక్ శస్త్ర చికిత్స తర్వాత, ఎన్ సీఏ ఫిజియో ఆశిష్ కౌశిక్ తో కలిసి మెడికల్ రివ్యూ కోసం లండన్ వెళ్లాడు. హార్దిక్ మ్యాచ్ లు ఆడటం ఇప్పుడే కుదరదని.. ఇంకా సమయం పడుతుందని డాక్టర్ జేమ్స్ అల్లీబోన్ తెలిపారు. హార్దిక్ పూర్తి ఫిట్ నెస్ సాధించేవరకు ఎన్ సీఏ లో ఆటగాళ్ల పునరావాస శిబిరంలోనే ఉంటాడు’ అని బీసీసీఐ తెలిపింది. హార్డిక్ పాండ్యా చివరిసారిగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో ఆడిన విషయం తెలిసిందే.

Hardik Pandya
Newzealand Test series
selections
backbone pain
injury
Cricket
  • Loading...

More Telugu News