Jagan: మన రాష్ట్రానికి పట్టుకున్న వైరస్ కరోనా వైరస్ కంటే ప్రమాదకరం: నక్కా ఆనందబాబు

  • ఏపీకి జగన్ వైరస్ పట్టుకుంది
  • రాజధాని ఉద్యమాన్ని మహిళలే నడిపిస్తున్నారు
  • అమరావతి కోసం అందరూ ఉద్యమించాలి

ఆంధ్రప్రదేశ్ కు జగన్ వైరస్ పట్టుకుందని... ఇది కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనదని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. అమరావతి ప్రాంతంలోని తుళ్లూరులో రైతులు చేస్తున్న ఆందోళనకు ఆనందబాబు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని ఉద్యమాన్ని మహిళలే నడిపిస్తున్నారని... వారిని చూసి ఇతర ప్రాంతాల వారు సిగ్గు తెచ్చుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా అమరావతి కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పాలకులు తప్పులు చేస్తున్నప్పుడు మేధావులు స్పందించాలని కోరారు. మేధావుల మౌనంతో రాష్ట్రానికి కీడు జరుగుతుందని అన్నారు. అమరావతిని శ్మశానం అన్నవారు... ఇప్పటి వరకు ఎక్కడ కూర్చొని పాలించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Jagan
YSRCP
Nakka Ananda Babu
Telugudesam
Amaravati
  • Loading...

More Telugu News