Union Budget 2020: బడ్జెట్ ప్రసంగం అత్యంత సుదీర్ఘంగా ఉంది కానీ వట్టి డొల్ల: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

  • పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం
  • సుదీర్ఘ ప్రసంగంతో నిర్మలా సీతారామన్ రికార్డు
  • చెప్పుకోదగ్గ అంశాలేవీ లేవన్న రాహుల్

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్టుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెదవి విరిచారు. బడ్జెట్ ప్రసంగం చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైనదిగా ఉంది కానీ, తరచి చూస్తే వట్టి డొల్లలాగే ఉందని విమర్శించారు. ఈ బడ్జెట్ లో చెప్పుకోదగ్గ విషయాలేవీ లేవని అన్నారు.

దేశంలో నిరుద్యోగమే ప్రధాన సమస్యగా ఉందని, కానీ యువతకు ఉద్యోగాల కల్పనకు తోడ్పడేలా ఏదైనా ప్రణాళికబద్ధంగా చేశారా అంటే అదీలేదని వ్యాఖ్యానించారు. బడ్జెట్ లో చాతుర్యం ప్రదర్శించారే తప్ప ఎలాంటి ముఖ్యోద్ధేశాలు కనిపించలేదని వెల్లడించారు. గతంలో చెప్పినవే ఇప్పుడూ చెబుతున్నారని విమర్శించారు.

Union Budget 2020
Rahul Gandhi
Nirmala Sitharaman
Congress
  • Loading...

More Telugu News