Sharjeel Imam: జేఎన్యూ విద్యార్థి షర్జిల్ ఇమామ్ ల్యాప్ టాప్, మొబైల్ ను సీజ్ చేసిన క్రైమ్ బ్రాంచ్

  • ఢిల్లీలోని వసంత విహార్ లో షర్జిల్ నివాసంలో పోలీసుల సోదాలు
  • ల్యాప్ టాప్, డెస్క్ టాప్ సీజ్
  • బీహార్ లోని ఇంట్లో మొబైల్ ఫోన్ స్వాధీనం

రెచ్చగొట్టే ప్రసంగం చేసిన జేఎన్యూ విద్యార్థి షర్జిల్ ఇమామ్ కు చెందిన ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం షర్జిల్ క్రైమ్ బ్రాంచ్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని వసంత విహార్ లో షర్జిల్ అద్దెకు ఉంటున్న ఫ్లాట్ లో పోలీసులు నిన్న సోదాలు జరిపారు. ఈ సందర్భంగా ల్యాప్ టాప్, డెస్క్ టాప్ ను సీజ్ చేశారు. మరోవైపు బీహార్ లోని జెహానాబాద్ లో షర్జిల్ ఇంట్లో అతని మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు .

సీఏఏ, ఎన్నార్సీలకి వ్యతిరేకంగా షర్జిల్ తయారు చేసిన పాంప్లెట్ ను కూడా ఢిల్లీలోని నివాసంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పోలీసుల విచారణలో షర్జిల్ పలు విషయాలను వెల్లడించాడు. భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చాలనుకున్నట్టు ఒప్పుకున్నాడు. అసోం గురించి తాను చేసిన వ్యాఖ్యలు నిజమేనని చెప్పాడు. సీఏఏను అమలు చేయాలనుకుంటే దేశం నుంచి అసోంను విడగొట్టాలని నిరసనకారులను ఉద్దేశించి షర్జిల్ రెచ్చగొట్టే ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని జనవరి 28న జెహానాబాద్ లో ఢిల్లీ పోలీస్ స్పెషల్ టీమ్ అరెస్ట్ చేసింది.

  • Loading...

More Telugu News