Amaravati: నాడు ల్యాండ్‌పూలింగ్‌ను వ్యతిరేకించి...నేడు అదే పనిచేయడమా?: జగన్ పై సీపీఐ మండిపాటు

  • పూలింగ్‌ పేరుతో భూ కుంభకోణానికి నాంది
  • పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను తీసుకోవడమా?
  • జీఓ నంబరు 72ను రద్దు చేయాలని డిమాండ్‌

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుందంటూ ల్యాండ్‌పూలింగ్‌ను వ్యతిరేకించిన జగన్‌, అధికారంలోకి వచ్చాక అదే పనిచేయడం విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి ధ్వజమెత్తారు. విశాఖ రాజధాని ఏర్పాటులో భాగంగా ల్యాండ్‌పూలింగ్‌కు పాల్పడడం అంటే భూకుంభకోణానికి తెరతీస్తున్నట్లేనని ఆరోపించారు. ఈరోజు ఆయన అమరావతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విశాఖ జిల్లాలోని ముదపాక, ఓజోన్‌ వ్యాలీలో ల్యాండ్‌ పూలింగ్‌ జరిగిందని, ఈ సందర్భంగా ఎన్నో మోసాలు వెలుగు చూశాయని గుర్తు చేశారు.

ఆ సమయంలో ల్యాండ్‌ పూలింగ్‌ను వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు అదే పని ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. పూలింగ్‌ పేరుతో పేదల జీవనోపాధికి ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూములను తీసుకోవడం వారి కడుపుకొట్టడమేనన్నారు. ఆ భూములు సేకరించవద్దని, ఇందుకోసం జారీ చేసిన 72వ నంబరు జీవోను తక్షణం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

  • Loading...

More Telugu News