Arasavalli: అరసవల్లిలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు

  • రథసప్తమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తుల రాక
  • సూర్యభగవానుడికి క్షీరాభిషేకం నిర్వహించిన పూజారులు 
  • స్వామిని దర్శించుకున్న స్పీకర్, మంత్రులు 

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమిని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తున్నారు. ఈ తెల్లవారుజామున వేదమంత్రోచ్చారణల మధ్య సూర్యభగవానుడికి పూజారులు క్షీరాభిషేకం నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి ప్రథమార్చన పూజల్లో పాల్గొన్నారు.

ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యనారాయణస్వామి నిజరూప దర్శనాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది.

Arasavalli
Ratha sapthami
Srikakulam District
  • Loading...

More Telugu News