Swamy Agnivesh: గాడ్సే వారసులమని బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు నిరూపించుకున్నాయి: స్వామి అగ్నివేశ్

  • సీఏఏ, ఎన్ ఆర్సీలను వ్యతిరేకిస్తూ విజయవాడలో సభ
  • ఈ సభకు హాజరైన టీడీపీ, సీపీఐ నేతలు
  • హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించాలని బీజేపీ చూస్తోంది: అగ్నివేశ్

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరసత్వ జాబితా (ఎన్ ఆర్సీ)ను వ్యతిరేకిస్తూ విజయవాడలో ప్రజాగర్జన సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేశ్ మాట్లాడుతూ, దేశంలో ముస్లింలను అణచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. హిందూ, ముస్లింల మధ్య బీజేపీ విభేదాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. గాడ్సే వారసులమని బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు నిరూపించుకున్నాయని ఘాటు విమర్శలు చేశారు. కాగా, ఈ సభకు టీడీపీ నేతలు కేశినేని నాని, గద్దె రామ్మోహన్ రావు, సీపీఐ నేత రామకృష్ణ తదితరుల హాజరయ్యారు.

Swamy Agnivesh
social Activist
CAA
NRC
  • Loading...

More Telugu News