carona virus: చెన్నై విమానాశ్రయంలో కరోనా వైరస్ కలకలం!

  • హాంగ్ కాంగ్ నుంచి చెన్నై వచ్చిన మహిళ
  • విమానాశ్రయంలో వైద్యపరీక్షల నిర్వహణ
  • ఆ మహిళలో ‘కరోనా’ లక్షణాలు

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. మన దేశంలో ఇప్పటికే కేరళలో ఈ తరహా కేసు నమోదైంది. తాజాగా, చెన్నైలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. హాంగ్ కాంగ్ నుంచి చెన్నైకు వచ్చిన మహిళకు విమానాశ్రయంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెలో ‘కరోనా’ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అత్యవసర చికిత్స నిమిత్తం అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.

carona virus
chennai
woman
Rajive Gandhi hospital
  • Loading...

More Telugu News