19 Toes-12 Fingers: 19 కాలివేళ్లు.. 12 చేతివేళ్లతో.. భారత మహిళ ప్రపంచ రికార్డుల్లోకి!

- గిన్నిస్ బుక్ లోకి ఒడిశాకు చెందిన కుమారి
- గతంలో 14 కాలివేళ్లు, 14 చేతివేళ్లతో దేవేంద్రా పేర రికార్డు
- పోలిడాక్టిలిజమ్ అనే సిండ్రోమ్ వల్లే ఈ అదనపు వేళ్లు
భారత్ కు చెందిన ఓ మహిళకు అసాధారణ రీతిలో పెరిగిన చేతి వేళ్లు, కాలి వేళ్లతో జన్మించినప్పటికీ.. ఆ అదనపు వేళ్లే ఆ మహిళకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పెట్టాయి. గతంలో ఈ రికార్డు భారత్ లోని గుజరాత్ కు చెందిన దేవేంద్రా సుథార్(47), పేర ఉండేది. ఇతనికి 14 కాలివేళ్లు, 14 చేతివేళ్లు ఉన్నాయి. తాజాగా ఈ రికార్డు 63 ఏళ్ల కుమారి కొట్టేసి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించింది.

గ్రామస్థులు తనను మంత్రగత్తెగా భావించడంతో బయట తిరగలేకపోతున్నానని చెప్పింది. తాను ఎక్కువ కాలం ఇంట్లోనే గడుపుతున్నట్లు కుమారి వెల్లడించింది. ఈ విషయాన్ని స్థానిక మీడియా బయటపెట్టడంతో విషయం గిన్నిస్ రికార్డుల దాకా వెళ్లిందని తెలుస్తోంది.