Actor Nagababu: తలుచుకున్నాను.. సాధించాను.. ఆరు నెలల్లో ఆకర్షణీయంగా మారిన నాగబాబు!

  • వైరల్ గా మారిన నాగబాబు బరువు తగ్గిన ఫొటోలు
  • పరిమిత ఆహారం, రెండు పూటలా వ్యాయామం
  • వయసు, ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి

నటుడు, నిర్మాత నాగబాబు భారీకాయం నుంచి స్లిమ్ గా ఆకర్షణీయంగా తయారయ్యారు. సన్నగా ఉండడమే ఆరోగ్యానికి మేలని ఆయన అంటున్నారు. తనకు బరువు తగ్గడానికి ఆరు నెలలు పట్టిందని పేర్కొంటూ.. మూడు ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఇందులో బరువు తగ్గిన ఫొటోలతో పాటు అంతకు ముందు తాను లావుగా ఉన్న ఫొటోలు కూడా ఉన్నాయి.

ఈ ఫొటోలకు అభిమానులనుంచి కామెంట్లు, లైక్ లు వెల్లువెత్తుతున్నాయి. బరువు తగ్గడానికి ప్రణాళిక ప్రకారం ఆహారం తీసుకోవడం.. వయసు, ఎత్తుకు తగ్గ బరువు మెయిన్ టెయిన్ చేయాలంటూ నాగబాబు తాను పాల్గొంటున్న షోల్లో నటీనటులకు సలహాలు ఇస్తుంటారు. అయితే, ఇతరులకు చెప్పేముందు తాను కూడా అనుసరించాలని నిర్ణయించుకుని బరువు తగ్గి ఆకర్షణీయంగా తయారయ్యారు. రోజుకు ఒక పూట మాత్రమే తింటూ ఉదయం, సాయంత్రం రెండు గంటల పాటు వ్యాయామం చేస్తానని నాగబాబు తెలిపారు.

Actor Nagababu
Tollywood
Weight loss
  • Loading...

More Telugu News