Chandrababu: చంద్రబాబును కలిసిన సీఎం రమేశ్... తనయుడి పెళ్లికి ఆహ్వానం

  • సీఎం రమేశ్ ఇంట పెళ్లిబాజాలు
  • ఫిబ్రవరి 7న సీఎం రమేశ్ తనయుడి వివాహం
  • చంద్రబాబుకు శుభలేఖ అందించిన సీఎం రమేశ్

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కుటుంబంలో పెళ్లిసందడి నెలకొంది. ఆయన తనయుడు రిత్విక్ వివాహం ఫిబ్రవరి 7న ప్రముఖ పారిశ్రామికవేత్త తాళ్లూరి రాజా కుమార్తె పూజతో జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం రమేశ్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడ్ని కూడా తన కుమారుడి పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించారు. సతీసమేతంగా వెళ్లి చంద్రబాబును కలిసిన సీఎం రమేశ్ శుభలేఖ అందించారు. ఈ విషయాన్ని సీఎం రమేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

  • Loading...

More Telugu News