Hyderabad: తాగిన మైకంలో అలా ఫిర్యాదు చేశా: మాటమార్చిన యూపీ డ్యాన్సర్

  • లిస్బన్ పబ్ నిర్వాహకుడిపై ఫిర్యాదు 
  • తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణ 
  • పబ్ లోకి అనుమతించకపోవడంతో ఆవేశపడ్డానని వివరణ

పబ్ నిర్వాహకుడు తనను లైంగికంగా వేధించాడంటూ హైదరాబాద్, బేగం పేటలోని లిస్బన్ పబ్ నిర్వాహకుడిపై రెండు రోజుల క్రితం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన డ్యాన్సర్ మాటమార్చింది. పబ్ లోకి తనను అనుమతించకపోవడంతో క్షణికావేశంలో తానీ ఫిర్యాదు చేశానని ఇప్పుడు చెబుతోంది. 

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ డ్యాన్సర్ రెండు రోజుల క్రితం పబ్ కి వెళ్లింది. ఆ సమయంలో నిర్వాహకుడు మురళీకృష్ణ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. తీరా పోలీసులు విచారణ జరిపే సమయానికి తాగిన మైకంలో ఏదో ఆవేశంలో చేసిన ఆరోపణే తప్ప అందులో నిజం లేదంటూ చెంపలు వేసుకోవడంతో ఆశ్చర్యపోవడం విన్నవారి వంతయ్యింది.

Hyderabad
begumpeta
police case
pubdancer
  • Loading...

More Telugu News