KTR: తెలంగాణ ఇసుక విధానమే బెస్ట్ అని కేంద్రం కూడా గుర్తించింది: కేటీఆర్

  • తెలంగాణ ఇసుక విధానం భేష్ అంటున్న కేంద్ర పర్యావరణ శాఖ
  • ట్విట్టర్ లో స్పందించిన కేటీఆర్
  • ఇతర రాష్ట్రాలకూ మార్గదర్శకంగా నిలిచామని ట్వీట్

ఇసుక మైనింగ్ అంశంలో ఇతర రాష్ట్రాలు తెలంగాణను అనుసరించాలంటూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పేర్కొనడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ బీజేపీ నేతలు ఓవైపు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరాధారమైన, అసహ్యం పుట్టించే విమర్శలు చేస్తున్నా, కేంద్రం తెలంగాణ ఇసుక విధానమే బెస్ట్ అని గుర్తించిందని ట్వీట్ చేశారు. అంతేకాదు, తెలంగాణ ఇసుక విధానాన్నే ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని కేంద్రం సూచిస్తోందని తెలిపారు.

KTR
Telangana
Sand Policy
NDA
BJP
TRS
  • Loading...

More Telugu News