Somireddy Chandra Mohan Reddy: ఎంజీఆర్, ఎన్టీఆర్ ఏం చేశారు? పవన్ కల్యాణ్ సినిమాల్లో నటిస్తే తప్పేంటి?: లక్ష్మీనారాయణకు టీడీపీ నేత సోమిరెడ్డి ప్రశ్న!

  • జనసేనకు రాజీనామా చేసిన సీబీఐ మాజీ జేడీ
  • భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేతలు
  • రాజకీయాల్లో నటించకుంటే చాలన్న సోమిరెడ్డి

జనసేన నేతగా గడచిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ, నిన్న జనసేన పార్టీకి రాజీనామా చేయగా, పలువురు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, "లక్ష్మీ నారాయణ గారూ, ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొన్ని సినిమాల్లో నటించడం చూశాం. పవన్ కల్యాణ్ ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తే రాష్ట్రానికొచ్చిన నష్టమేం లేదు. కానీ... రాజకీయ నాయకులు నిజ జీవితంలో నటిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం" అని వ్యాఖ్యానించారు.

Somireddy Chandra Mohan Reddy
V.V Lakshminarayana
Janasena
Resign
Pawan Kalyan
  • Loading...

More Telugu News