Janasena: బీఫామ్ తీసుకుని, ఓడిపోగానే తెల్లకాగితంపై రాజీనామా చేస్తే నిలకడగా ఉన్నట్టా?: లక్ష్మీ నారాయణపై జనసేన నిప్పులు

  • రాజకీయాలంటే టెస్ట్ మ్యాచ్
  • ఓర్పు, సహనం తప్పనిసరి
  • ట్విట్టర్ లో పోతిన వెంకట మహేశ్

"రాజకీయాలంటే 20-20 మ్యాచ్ కాదు. టెస్ట్ మ్యాచ్. ఓర్పు, సహనం, నిరీక్షణ ఉండాలి. నాయకుడంటే ఓడిపోగానే వదిలి వెళ్లిపోవడం కాదు. పార్టీలో ప్రాథమిక సభ్యత్వంతో పాటు బీ ఫార్మ్ తీసుకున్నారు. ఓడిపోగానే తెల్లకాగితాల మీద రాజీనామాలు చేస్తున్నారు. నిలకడ అంటే ఇదేనా?" అని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్, సీబీఐ మాజీ జేడీ, జనసేనకు నిన్న రాజీనామా చేసిన లక్ష్మీ నారాయణపై మండిపడ్డారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు పెట్టారు. "రాజకీయాల్లో ఉంటూ వేల కోట్ల రూపాయలను వ్యాపారాల ద్వారా సంపాదిస్తున్న వారిని ప్రశ్నించడం చేతకావడం లేదు. ఆర్థిక నేరగాళ్లు దర్జాగా తిరుగుతుంటే, సిద్ధాంతాల మీద నిలబడిన వ్యక్తులకి నేడు కాకపోతే రేపైనా ప్రజలు అండగా నిలబడతారు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

Janasena
Pothina Venkata Mahesh
V.V Lakshminarayana
Resign
  • Loading...

More Telugu News