Kanna Lakshminarayana: ఏపీ సీఎం జగన్ కు కన్నా లక్ష్మీనారాయణ లేఖాస్త్రం

  • వినాశకర ఆలోచనలతో ముందుకెళుతున్నారని విమర్శలు
  • రాష్ట్రంపై మరింత భారం పడుతుందని ఆందోళన
  • జీఎన్ రావు కమిటీ నివేదికలోని అంశాలను ఎందుకు పట్టించుకోలేదన్న కన్నా

ఏపీలో నెలకొన్న తాజా పరిణామాలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్ కు లేఖ రాశారు. సచివాలయాన్ని మార్చడం సహేతుకం కాదని హితవు పలికారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ పరిపాలన వికేంద్రీకరణ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పుల్లో చిక్కుకున్న రాష్ట్రంపై ఇలాంటి నిర్ణయాలతో తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వెలిబుచ్చారు. జీఎన్ రావు కమిటీ నివేదికలోని అంశాలను ఎందుకు పట్టించుకోవడంలేదని కన్నా ప్రశ్నించారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్నదే తమ అభిమతమని లేఖలో స్పష్టం చేశారు. పరిపాలనా వికేంద్రీకరణకు బీజేపీ వ్యతిరేకమని తెలిపారు. అన్ని వర్గాల నుంచి నిరసనలు వస్తున్నా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం వినాశకర రీతిలో ముందుకెళుతోందని విమర్శించారు.

Kanna Lakshminarayana
Jagan
Andhra Pradesh
Letter
Amaravati
Decentralization
BJP
  • Loading...

More Telugu News