Mopidevi Venkataramana: మోపిదేవి మంత్రిత్వ శాఖ కన్నబాబుకు బదిలీ!

  • మార్కెటింగ్ శాఖ కన్నబాబుకు అప్పగింత
  • ఆహారశుద్ధి విభాగం కూడా కన్నబాబుకు అప్పగిస్తూ నిర్ణయం
  • ఇప్పటివరకు ఆహారశుద్ధి విభాగాన్ని పర్యవేక్షించిన మేకపాటి గౌతంరెడ్డి

ఏపీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం మంత్రిత్వ శాఖల్లో మార్పులు చేర్పులు చేశారు. ప్రభుత్వం ఇద్దరు మంత్రుల శాఖల్లో మార్పులు చేసింది. మోపిదేవి వెంకటరమణ నిర్వహిస్తున్న మార్కెటింగ్ శాఖను కురసాల కన్నబాబుకు అప్పగించారు. కన్నబాబుకు ఆహారశుద్ధి విభాగాన్ని కూడా అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమల శాఖ నుంచి ఆహారశుద్ధి విభాగాన్ని వేరు చేశారు. ఆహారశుద్ధి విభాగాన్ని ఇప్పటివరకు మేకపాటి గౌతం రెడ్డి పర్యవేక్షించారు. కాగా, కన్నబాబు వ్యవసాయ మంత్రిత్వ శాఖను చూస్తున్న సంగతి తెలిసిందే.

Mopidevi Venkataramana
Kannababu
Mekapati Goutham Reddy
Andhra Pradesh
YSRCP
  • Loading...

More Telugu News