Tihar: తీహార్ జైలుకు చేరుకున్న తలారి పవన్ జల్లాద్... రేపు డమ్మీ ఉరి

  • నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరి
  • నలుగురికీ ఏకకాలంలో మరణశిక్ష అమలు
  • తీహార్ జైల్లో ఏర్పాట్లు
  • ఉరికంబం, ఉరితాడు పరిశీలించనున్న తలారి

దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనలో దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, దోషులను ఉరితీసే తలారి పవన్ జల్లాద్ మీరట్ నుంచి ఢిల్లీలోని తీహార్ జైలుకు చేరుకున్నారు. పవన్ జల్లాద్ రేపు ఉరితాడు, ఉరికంబం సామర్థ్యాలను పరీక్షించనున్నారు. జైలు అధికారుల సమక్షంలో డమ్మీ ఉరి నిర్వహించనున్నారు. నిర్భయ కేసులో నలుగురు దోషులను ఏకకాలంలో ఉరి తీయనున్నారు. కాగా, తలారి పవన్ జల్లాద్ కు తీహార్ జైలు ప్రాంగణంలోనే ప్రత్యేకంగా బస ఏర్పాటు చేశారు. మరోవైపు, నిర్భయ దోషి వినయ్ శర్మ రాష్ట్రపతి క్షమాభిక్ష కోరడంతో ఉరి ఫిబ్రవరి 1న ఉరి అమలుపై సందిగ్ధత నెలకొంది.

Tihar
Pawan Jallad
HangTrial
Nirbhaya
  • Loading...

More Telugu News