China: చైనాలో తెలుగు ఇంజినీర్లు సేఫ్... వీడియో పంచుకున్న నారా లోకేశ్

  • చైనాలో వేగంగా పాకిపోతున్న కరోనా వైరస్
  • అనేక మంది మృతి
  • 58 మంది తెలుగు ఇంజినీర్ల పరిస్థితిపై ఆందోళన
  • పుకార్లను నమ్మవద్దని లోకేశ్ విజ్ఞప్తి

చైనాలో కరోనా వైరస్ కారణంగా అనేకమంది మృత్యువాత పడుతున్న నేపథ్యంలో 58 మంది తెలుగు ఇంజినీర్లు వుహాన్ నగరంలో చిక్కుకుపోవడం ఆందోళన రేకెత్తించింది. వారిని చైనా వర్గాలు భారత్ వెళ్లనివ్వకుండా నిర్బంధించాయంటూ వార్తలు వచ్చాయి. అయితే తాము సురక్షితంగానే ఉన్నామని, తమను ఎవరూ నిర్బంధించలేదని తెలుగు ఇంజినీర్లు ఓ వీడియోలో వెల్లడించారు. ఇప్పుడా వీడియోను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో పంచుకున్నారు. వుహాన్ లో ఉన్న తెలుగు టెకీల పరిస్థితి గురించి టీసీఎల్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడానని, వారందరూ భద్రంగా ఉన్నట్టు తెలిసిందని వివరించారు. వారిని సంస్థ యాజమాన్యం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటోందని వారి వీడియో ద్వారానే అర్థమవుతోందని, పుకార్లను ఎవరూ నమ్మవద్దని లోకేశ్ విజ్ఞప్తి చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News