Sun: సూర్యుడి ఉపరితలంపై ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి!
- సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన వీడియో
- అత్యంత స్పష్టంగా భానుడి ఉపరితలం
- మండే వాయువులతో భగభగలాడుతున్న సూర్యుడు
సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్న ఓ భారీ నక్షత్రం. పైగా భగభగమండే అగ్నిగోళం. సూర్యుడి ఉపరితలంపై ఉండే వాయువులు నిత్యం అగ్నికీలలను విరజిమ్ముతూ ఉంటాయి. అయితే ఇప్పటివరకు సూర్యుడి సమీపానికి వెళ్లడం సాధ్యంకాకపోవడంతో దాని ఉపరితలానికి సంబంధించి స్పష్టమైన చిత్రాలు లభ్యం కాలేదు.
అయితే హవాయి దీవుల్లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన డేనియల్ కే ఇనోయే సోలార్ టెలిస్కోప్ భానుడి ఉపరితలం ఎలా వుంటుందో కళ్లకు కట్టినట్టు చూపించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సూర్యుడి ఉపరితలంపై వాయువులు ఉబుకుతుండగా, ఆ వాయువులు మండిపోతుండడం, మళ్లీ అంతలోనే చల్లారిపోతూ, మళ్లీ కొత్త వాయు బుడగలు పుట్టుకొస్తూ నిరంతరం మండిపోతున్న సూర్యుడ్ని ఈ అతి భారీ టెలిస్కోప్ అత్యంత స్పష్టంగా ఆవిష్కరించింది.