Baireddy Rajasekhar Reddy: జగన్ ఏపీకి సీఎం మాత్రమే... కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేసీఆరే: బైరెడ్డి

  • సీఎం జగన్ పై బైరెడ్డి ధ్వజం
  • కోతికి అద్దమిస్తే నేలకేసి కొట్టినట్టు జగన్ పాలన ఉందన్న బైరెడ్డి
  • జగన్ ను నడిపిస్తోంది కేసీఆరేనని వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ పై బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ ఏపీకి సీఎం మాత్రమేనని, ఆయనను నడిపించేది కేసీఆరేనని ఆరోపించారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేసీఆర్ నిర్వహిస్తుంటాడని అన్నారు. ఆంధ్రుల అభిమానం దెబ్బతీసిన కేసీఆర్ ఇప్పుడు జగన్ కు మార్గదర్శి అని వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో రాష్ట్రం నాలుగడుగులు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. కోతికి అద్దమిస్తే ఏంచేయాలో తెలియక నేలకేసి కొట్టినట్టుగా జగన్ పాలన ఉందని ఎద్దేవా చేశారు.

Baireddy Rajasekhar Reddy
Jagan
KCR
Andhra Pradesh
Telangana
YSRCP
BJP
  • Loading...

More Telugu News