Balakrishna: బాలకృష్ణ కాన్వాయ్ పై దాడి ప్రయత్నాలు సరికాదు: వర్ల రామయ్య

  • బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలో నిరసన సెగ
  • కాన్వాయ్ ను అడ్డగించిన స్థానికులు
  • జగన్ ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ ఆగ్రహం

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలో తీవ్ర నిరసనలు ఎదురైన సంగతి తెలిసిందే. ఆయన కాన్వాయ్ ను అడ్డుకున్న స్థానికులు అధికార వికేంద్రీకరణకు అడ్డుపడుతున్నారని, సీమలో హైకోర్టు ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య స్పందించారు. బాలకృష్ణ కాన్వాయ్ పై దాడి చేసేందుకు యత్నించడం సరికాదని హితవు పలికారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టవద్దంటూ సీఎం జగన్ కు సూచించారు. సీఎం జగన్ అనేక చోట్ల తగాదాలు పెడుతున్నారని ఆరోపించారు. అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Balakrishna
Hindupur
Protests
Varla Ramaiah
Jagan
  • Loading...

More Telugu News