Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ కు అభినందనలు తెలిపిన సీపీఐ రామకృష్ణ

  • నితీశ్ కుమార్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు అభినందనలు
  • సీఏఏ, ఎన్నార్సీకి వైసీపీ మద్దతు తెలిపింది
  • వీటికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయమని జగన్ కు చెప్పండి

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను జేడీయూ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ కు సీపీఐ నేత రామకృష్ణ బహిరంగ లేఖ రాశారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలకు మద్దతిచ్చిన జేడీయూ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు అభినందనలు తెలిపారు. ఇదే సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి తల వంచుతూ సీఏఏ, ఎన్నార్సీకి వైసీపీ మద్దతు తెలిపిందని... వైసీపీకి మీరు సలహాదారుగా వ్యవహరించారని... ఈ నేపథ్యంలో, వీటికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసేలా జగన్ కు సూచించాలని ప్రశాంత్ కిశోర్ ను కోరుతున్నామని అన్నారు.

Prashant Kishor
CPI Ramakrishna
Jagan
CAA
NRC
YSRCP
JDU
  • Loading...

More Telugu News