Mopidevi Venkataramana: పార్టీ నుంచి నాకు భరోసాలు ఏమీ లేవు: మోపిదేవి

  • రాష్ట్రం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని వెల్లడి
  • జగన్ సమన్యాయం కోసం కృషి చేస్తున్నారని కితాబు
  • సమయం వచ్చినప్పుడు తామే పదవులు త్యజిస్తామని వ్యాఖ్యలు

శాసనమండలి నుంచి మంత్రి పదవి దక్కించుకున్న వైసీపీ నేత మోపిదేవి వెంకటరమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మండలి రద్దయితే తన మంత్రి పదవి పోతుందన్న నేపథ్యంలో ఆయన స్పందించారు. రాష్ట్రానికి మంచి జరగడం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని అన్నారు. పార్టీ నుంచి తనకు భరోసాలు ఏమీ లేవని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేందుకే జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు తామే పదవులు త్యాగం చేస్తామని మోపిదేవి ఉద్ఘాటించారు. మండలిపై నిబంధనలకు లోబడే నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

Mopidevi Venkataramana
YSRCP
AP Legislative Council
Abolition
Minister
  • Loading...

More Telugu News